Thursday, 2 April 2015

ఆ విషయంలో నయనతార మినహాయింపే


కొత్త నాయికలజోరులో మూడు పదుల వయసు దాటిన సీనియర్ కథానాయికలకు అవకాశాలు రావడం అనేది నేటి సినీపరిశ్రమలో కష్టమే అని సినీ పండితుల అంచనా. అయితే నయనతార హవాను చూస్తుంటే ఈ  విషయంలో ఆమె మినహాయింపనే చెప్పాలి. సరిగ్గా రెండేళ్ల క్రితం సినిమాల నుంచి  తప్పుకోని ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ లవ్‌ఫెయిల్యూర్ అవడంతో బాగా డీలాపడ్డ నయనతారకి శ్రేయాభిలాషుల ఇచ్చిన సలహాతో  మనసు మార్చుకున్న ఆమె తిరిగి సినిమాలవైపు దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమలో ఏడు చిత్రాల్లో నటిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ దశాబ్దకాలంలో ఓ కథానాయిక నటించిన ఆ ఏడు చిత్రాలు మూడు నెలల వ్యవధిలో విడుదల కావడం జరగలేదని, సినీపండితులు గుసగుసల ఆడుకుంటున్నారు. ఏది ఏమైన నయనతార మళ్ళి వరుసగా చిత్రాలు తీయడం ఆమె అభిమానులకు శుభవార్తే.

No comments:

Post a Comment