తెలుగు చిత్ర పరిశ్రమ లో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన దర్శకుడు భీమనేని, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్. వీరి కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ చేసారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. దర్శకుడు భీమనేని సొంత సంస్థ 'గుడ్ విల్ సినిమా' బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి, జులై నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తామని, ఆగస్ట్ 28న చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియజేసారు.
తమిళ్ లో 'సుందర్ పాండియన్' గా విడుదలై శతదినోత్సవo జరుపుకుని నిర్మాతలకి, పంపిణిదారులకి కనక వర్షం కురిపించిన ఈ కథన తెలుగు రీమేక్ గా, మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసామని, ‘సుడిగాడు' తర్వాత తనకిది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే చిత్రమని దర్శకుడు భీమనేని తెలియజేశారు.
No comments:
Post a Comment