Sunday, 5 April 2015

ఎన్టీఆర్, సుకుమార్ ల సినిమా పేరు ఖరారు.


ఎన్టీఆర్‌ 'టెంపర్‌' చిత్రంతో తిరిగి సక్సెస్‌బాట పట్టారు. ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అభిమానులకు ఒక శుభవార్త  ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్ర కథ తండ్రి కొడుకుల ప్రతీకార నేపథ్యంలో తెరకేక్కుతుందని, అందుకే ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో' అనే పేరుని ఖరారు చేసినట్లు తెలిపారు. “ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 17నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ కొత్తగా ఉంటుంది దర్శకుడు సుకుమార్  ఎన్టీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్‌ను డిజైన్‌చేసాడు.” అని ఈ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ చెప్పాడు. ఫ్లోప్ లో ఉన్న సుకుమార్‌ మళ్ళి సక్సెస్ ట్రాక్ లో రావాలని కష్టపడుతున్నారు.


No comments:

Post a Comment