ఈటివీ ప్రారంభిoచినప్పటీ నుంచి ఈ సంస్థతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ ఛానల్ లోఅనేక కార్యక్రమాలు చేశాను. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను రాజీవును పెళ్లి చేసుకోకుండా కేరళలో ఉండిపోయుంటే ఇంతమంది అభిమానం ధక్కకపోయుండేదేమో అని. ‘స్టార్ మహిళ’ కార్యక్రమాని మధ్యహ్నం ప్రసారం చేస్తున్నారు అనేసరికి కొందరు బయటివారు పెదవి విరిచారు . ఈ సమయంలో గేమ్ షోనా అంటూ విమర్శించారు. కాని ‘స్టార్ మహిళ’ సాధించిన విజయం మిగిలిన చానల్స్ లో ఇలాంటి గేమ్ షో లు వచ్చేలా చేసింది. ఇప్పుడు ‘స్టార్ మహిళ’ 2000 ఎపిసోడ్లు పూర్తిచేసుకొందంటే నమ్మలేకపోతున్న. ఈ మధ్యనే ప్రారంబిచినట్లు ఉంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో 12 వేల మంది మహిళలను కలిసాను. భారతదేశ బుల్లి తెరలో ఇది ఒక చరిత్ర. అందరు పేర్లు గుర్తుండక పోయిన వారితో నేను కలిసి చేసిన అల్లరి మరిచిపోలేను. ఈ కర్యక్రమాని నేను ఇంత విజయవంతంగా నిర్వహించ గలుగుతున అంటే నా కుటుంబమే కారణం.
చదువుకొనే రోజులో నేను పెద్దగా న్యూస్ పేపర్లు. పుస్తకం పట్టుకున్నది లేదు కాని ఈ కార్యక్రమం కోసం రోజువార్తలు ఫాలో అవుతున్నా. వర్తమానా విషయంలో అప్ డేట్ గా ఉంటున్నా. టీవీ షో కదా అని స్క్రిప్ట్ పట్టుకుంటే ఆకట్టుకోలేం. ఇన్నాళ్ళు మేము కార్యక్రమం చేయడం ఒక విషయం అయితే ఇన్నాలు మా షో ని ఆదరించిన ఆడియన్స్ కు మా ధన్యవాదాలు.
No comments:
Post a Comment