ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే సూర్య అనే యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే ఆసక్తికరమైన కథాంశతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. వినోదంతో పాటు కమర్షియల్ అంశాలు మేళవించి ప్రయోగాత్మకంగా తెరకెక్కించాం. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 15న రోజున చిత్ర గీతాల్ని విడుదల చేస్తున్నాం. ఈ నెలాఖరులో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ ‘సూర్య అనే యువకుడు సూర్య తేజస్సును ఏ మాత్రం తట్టుకోలేడు. పగటిపూట బయట కాలుపెట్టాలంటే భయంతో వణికిపోతాడు. కేవలం రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తుంటాడు. ఇక సూర్య కాంతిని తట్టుకోలేని ఈ యువకుడి పేరు కూడా సూర్య కావడం మరో విశేషం. ఇంతకి సూర్యుడితో సూర్యకు వున్న సంబంధమేమిటి? ఇలాంటి ఓ యువకుడు అమ్మాయి ప్రేమలో పడితే అతడి జీవిత ప్రయాణం ఎలా సాగింది?’ అనేది మా చిత్ర ఇతివృత్తం’ అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
త్రిధ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజీషిండే, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, సలీమ్ఫేక్, అల్లరి సుభాషిణి, వివా హర్ష, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ నెరసు, ఆర్ట్: టి.ఎన్‌పసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కృష్ణ చిన్ని, సంగీతం: సత్య మహావీర్, రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.
No comments:
Post a Comment